మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Varadaraja Stotram – శ్రీ వరదరాజ స్తోత్రం


శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః |
తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || 1 ||

సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః |
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || 2 ||

హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః |
తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః || 3 ||

బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్యమహామఖసుపూజితః |
వేదవేద్యో వేగవతీవేగభీతాత్మభూస్తుతః || 4 ||

విశ్వసేతుర్వేగవతీసేతుర్విశ్వాధికోఽనఘః |
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః || 5 ||

బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః |
వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః || 6 ||

వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః |
శంఖచక్రలసత్పాణిశ్శరణాగతరక్షకః || 7 ||

ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్ |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వసిద్ధిర్భవేద్ధ్రువమ్ || 8 ||

ఇతి శ్రీనారదపురాణే వరదరాజస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.